Wednesday, February 13, 2008

ట్యూన్లు అయిపోయాయి

దాదాపు పదిహేనేళ్ల క్రితం ఇళయరాజా పాటల్లో క్వాలిటీ తగ్గుతోంది అని స్నేహితుడితో అంటే రాజా దగ్గర ట్యూన్లు అయిపోయాయి అన్నాడు. అదేం మాట అని అనుకున్నాను. తమిళ్, తెలుగు సినిమాలకు ఆయన అందించిన సంగీతం ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఈ పదిహేనేళ్లలో ఇళయరాజా నుంచి చాలా కొన్ని పాటలు మత్రమే చెప్పుకోతగ్గవి వచ్చాయి. సంగీతం మీద అంత పట్టున్న ఆయన పాటల్లో పస తగ్గడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.

తెలుగు సినిమాలకు తెలుగుదనం తెచ్చిన బాపు-రమణలదీ అదే పరిస్థితి. పెద్దగా పేరు రాక పోయినా 'గోరంత దీపం' సినిమా నాణ్యతా పరంగా ఏ విషయంలోనూ తీసిపోదు. అలాంటి వాళ్లు ఈ మధ్య తీసిన సినిమాలు చుస్తే వాళ్లే చేశారా అన్న అనుమానం కలగక మానదు.

సాగరసంగమం వంటి అద్భుతాన్నిచ్చిన విశ్వనాధ్ చిన్నబ్బాయ్ లాంటి సినిమా ఎందుకు తీశాడో అర్ధంకాలేదు.

జోకర్ సినిమా నుంచి వంశీ పతనం ప్రారంభమైంది. ఎప్పుడు సినిమాలు మానేస్తాడా అని ఎదురు చూస్తున్నా. వంశీకి వీరభిమానిని నేను.

ప్రతీ సినిమా ఆణిముత్యంలా తీయడం దాదాపు అసాధ్యం. కానీ క్వాలిటీగా తీయడం పెద్ద విషయం కాదు. వయసు మీద పడటంవల్ల వాళ్లు బాగా తీయలేకపోతున్నారనుకుంటే 70ల్లో ఉన్న క్లింట్ ఈస్ట్వుడ్, స్కోర్సిసీ, షూమేకర్ అలాంటిదేమీ లేదని నిరూపిస్తున్నారు.

8 comments:

కొత్త పాళీ said...

మంచి మాటలు చెప్పారు. అనుమానాస్పదం చూసి బుర్ర వాయగొట్టుకున్నాను. బాపు మీద ఆశ వొదిలేసుకున్నాక మిస్టర్ పెళ్ళాం, పెళ్ళిపుస్తకంలతో మళ్ళీ కొంచెం ఆశ కలిగించాడు. నా దృష్టిలో విశ్వనాథ పస శుభలేఖ సినిమాతో ఫినిష్.
అలాగని కొత్తగా వస్తున్న కుర్రకారు పెద్ద ఊడబొడుస్తున్నది ఏమీ లేదు.

Anonymous said...

:)
Is word verification required for comments? Please disable the option.

rākeśvara said...

ట్యూన్లు అయ్యిపోయాయి !
అచ్చంగా ఇదే మాట నాతో కూడా ఎవరో ఎప్పుడో అన్నారు.
నేను నివ్వెర పోయాను !

పద్మ said...

బాగా చెప్పారండి.

అప్పటివరకు మంచి సంగీత సాహిత్యాలతో, కథా కథనాలతో, పాత్రలకి సరిపోయే తారాగణంతో చక్కటి సినిమాలు తీసిన దర్శకులందరికీ ఏమైందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం. బాపు కొత్త సినిమా సుందరకాండ పాటలు విన్నాక ఒకరకంగా విరక్తి కలిగింది. వాళ్ళకేమైందో, ఎలాంటి సినిమాలు తీస్తున్నారో, అసలెందుకు తీస్తున్నారో వాళ్ళకన్నా అర్థం అవుతోందో లేదో. వాళ్ళకున్న పేరుని బట్టి చెత్త సినిమాలు తీసినా జనాలు వచ్చి చూస్తారు అన్న నమ్మకమేమో.

Anonymous said...

nijamegaaneyamdi asabhyta valakabostunna ippati vaarikannaa vaare nayam anipistundi

Anonymous said...

bhayya ..
nuvvu evaro naaku telidu
ilayaraja gurincih ala ante matram nenu hurt aipotha ..
in the last 60 days .. i have discovered atleast 50 magical ilayaraja songs .. all from 1993 to 2007 ..
telugu tamil malayalam kannada :)
have found some real amazing tunes ! .. Some of them are better than what i have listened to till date .. i have relaxed language barriers for ilayaraja . ilayaraja is infinite my friend .. and this is no understatement :)

Anonymous said...

replace understatement with overstatement :D

Santosh said...

meeru evaro naaku teliyadhu.....but illayaraja ni alaa ante mathram oppukolenu....
vamshi, vishwanath sangathi emo gaani....
illayaraja compositions lo janaki,spb gonthu lo thedalu mathram jarige chance ledhu.....
telugu lo illayaraja pataalu thakkuva vasthunnai....adhi nijame.....kaani tune lu aipoledhu, quality thagga nu ledhu.....
tamil malayalam kannada lo adbuthamaina paatalu vasthune vunnai......tune lu gurinchi matladuthunnaru kabatti baasha barrier kaadu ani anukuntunna.....

Raja cheyyi vesthe adhi wrong ayipodhu leraa....